దాతల సహకారంతో పాఠశాల సౌకర్యాలు మెరుగుపడతాయ .............మామిడి వెంకన్న

దాతల సహకారంతో పాఠశాల సౌకర్యాలు మెరుగుపడతాయ .............మామిడి వెంకన్న
తెలంగాణ వార్త ఫిబ్రవరి25 పెన్ పహాడ్ మండల పరిధిలోని దోస పహాడ్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామ దాతలు సహకారంతో పాఠశాల సౌకర్యాలు మెరుగుపడతాయి అన్నారు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మామిడి వెంకన్న మంగళవారం మండల పరిధిలోని యు పి ఎస్ దోసపహాడ్ పాఠశాలకు గ్రామ పూర్వ విద్యార్థి గద్దల వెంకటరమణ నాగయ్య పీజీటీ బయో సైన్స్ దంపతులు అతని తల్లిదండ్రులైన గద్దల లక్ష్మమ్మ, ఇద్దయ్య, జ్ఞాపకార్థం. పాఠశాల గోడలపై దేశ నాయకుల బొమ్మలు వేయించడం కోసం 5000 వేల రూపాయల నగదును ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మామిడి వెంకన్న గారికి అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ దోసపహాడు గ్రామంలోని పూర్వ విద్యార్థులు, ఉద్యోగస్తులు,యువత, గ్రామ ప్రముఖులు, పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం. అభినందనీయమన్నారు. గద్దల వెంకటరమణ నాగయ్య దంపతులకు పాఠశాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల చైర్మన్ పందిరి రేణుక వీరస్వామి, గ్రామ కార్యదర్శి జానీ, ఉపాధ్యాయులు ఎ.విజయ కుమారి, వై.వెంకన్న, ఎస్. విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.