కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

Mar 12, 2025 - 20:01
 0  0
కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

జోగులాంబ గద్వాల 12 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి మొదటి విడతగా 23 మంది విద్యార్థులకు కంటి అద్దాలను జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంపిణీ చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కంటి అద్దాలను స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సంతోష్ కంటి అద్దాలను పంపిణీ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తకముందే విద్యార్థులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పట్ల వైద్యాధికారులు అవగాహన కల్పించాలన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యక్రమాలైన నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ బ్లైండ్ నెస్/రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 5వ తరగతి నుండి 10వ తరగతి చదువుకుంటున్నా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 1784 ముందు విద్యార్థులు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.  మొదటి విడతగా 361 మంది విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీలో భాగంగా ఈరోజు బాలికల ఉన్నత పాఠశాలలో 23 మంది విద్యార్థులకు మొదటి విడతగా కంటి అద్దాలను పంపిణీ నిర్వహించడం జరుగుతుందన్నారు.  ప్రభుత్వం RBSK పథకం కింద విద్యార్థులకు కంటి సమస్యలు, అనిమియా ఇతర ఆరోగ్య సమస్యలను వైద్యనిపులతో గుర్తించి పరిష్కరించడం జరుగుతుందన్నారు.  విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆరోగ్య సమస్యలను అధిగమించాలని సూచించారు.  విద్యార్థులు ఉన్నత విద్యా కోసం జిల్లాలో అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ప్రతి మండలంలో పదవ తరగతి అనంతరం ఇంటర్, డిగ్రీ విద్యతో పాటు వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  విద్యాపరంగా వెనుకబడిన గట్టు కేటి దొడ్డి మండలాల నుండి 9 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం జరిగిందని, ఒక విద్యార్థికి గద్వాల మెడికల్ కళాశాలలోనే సీట్ లభించింది అని అన్నారు.  విద్యార్థులు చదివి ఉన్నత స్థాయికి  ఎదగాలన్నారు.  బాలికల పాఠశాలలో మరుగుదొడ్లు సరిపోవడం లేదని ఒక విద్యార్థి జిల్లా కలెక్టర్ కు విన్నవించుకోగా, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అదనపు మరుగుదొడ్ల నిర్మాణం కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం మరియు ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల నుండి నిధులు కేటాయించి మరుగుదొడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు.  ఈనెల 21వ తేదీ నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలు బాగా రాసి 10 GPA సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

     గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో వైద్యాధికారులతో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.  జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, కేటి దొడ్డి మండలంలో 25 ఎకరాల స్థలంలో 200 కోట్లతో గురుకుల పాఠశాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ కృషితో జిల్లాలోని అన్ని మండలాలలో 40 శాతం విద్యను అభివృద్ధి పరచడం జరిగిందని, ఇందులో భాగంగా గట్టు మండలంలోని 9 మంది విద్యార్థులు మెడిసిన్ కు ఎంపికైనట్లు తెలిపారు.  జిల్లాలో మెడికల్ కళాశాలతో పాటు ప్యారా మెడికల్ కళాశాల, ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను మంచి విద్యను అందించేందుకు ప్రోత్సహించి పాఠశాలలకు పంపాలని కోరారు.  జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల తప్ప అన్ని రకాల కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉన్నత విద్యకు దూరప్రాంతాలకు వెళ్లకుండా గద్వాల జిల్లాలోని అన్ని సదుపాయాలతో ఉన్నత విద్యను అందించడం జరుగుతుందన్నారు.  ఈనెల 21వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 

    ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సిద్ధప్ప, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జహురుద్దీన్, వైద్యశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333