పశుగణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం
అడ్డగూడూరు 13 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మిదేవికాల్వ గ్రామంలో గర్భకోశ వ్యాధుల నివారణకు చికిత్స,గాలికుంటూ టీకాలను మంగళవారం గ్రామ సర్పంచ్ వల్లభట్ల రమాదేవి పూర్ణచంద్రరావు ఆదేశాల మేరకు,ఉపసర్పంచ్ కంబాల వీరయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వల్లంభట్ల రవీందర్ రావు,వార్డు సభ్యులు ముత్తిలింగం, చిగుళ్ల గంగరాజు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అడ్డగూడూరు మండల పశువైద్యాధికారి అనిల్ రెడ్డి,ఆత్మకూర్ డాక్టర్" సంతోష్,సూపర్ వైజర్ పగిళ్ల శ్రీను,ఈ క్యాంపులో మొత్తం చికిత్స చేసిన గేదెలు 125 ఆవులు 72 గొర్రెలు 88 మేకలు 32 వీటికి చికిత్స చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కన్నేబోయిన గంగరాజు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మగాని లక్ష్మయ్య,పొన్నాల పుల్లయ్య,పశు వైద్య సిబ్బంది,గోపాలమిత్ర కొమురయ్య,సతీష్, మల్లేష్,రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.