ఎన్.పి.ఆర్.డి మహిళా విభాగం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు  జిల్లా కన్వీనర్ కొత్త లలిత

Jan 13, 2026 - 19:03
 0  11
ఎన్.పి.ఆర్.డి మహిళా విభాగం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు  జిల్లా కన్వీనర్ కొత్త లలిత

భువనగిరి 13 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– భువనగిరి జిల్లా కేంద్రంలో ఎన్.పి.ఆర్.డి మహిళా విభాగం 16వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి మహిళా జిల్లా కన్వీనర్ కొత్త లలిత హాజరై ముగ్గుల పోటీలలో పాల్గొని గెలుపొందిన వాళ్లకు బహుమతి అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆమె ఉద్దేశించి మాట్లాడుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జిల్లాలో మహిళా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని  వికలాంగులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటికి జిల్లాలో  మహిళ వికలాంగుల పైన  అత్యాచారాలు జరుగుతున్నవి దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం విప్లవం అయిపోయింది   ఇప్పటికైనా అలాంటి వాళ్ళని క్షమించకుండా జీవిత ఖైదీలుగా నిర్ణయించాలని ఆమె డిమాండ్ చేయడం జరిగింది.అదే విధంగా వికలాంగుల మహిళలు చదువుకొని ఉన్న ఉద్యోగాల అవకాశాలు లేకుండా పోవడం వల్ల వెంటనే ఉద్యోగాలు కల్పించాలి!చదువులేకున్న మహిళ  వికలాంగులకు ఇంటిదగ్గర కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వాళ్లకి ఏమి జరిగినా అన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్.పి.ఆర్. డి జిల్లా నాయకులు ఎశాల గోపి శారదా,పెరికేటి లక్ష్మి, ఎశల బాలమణి,లక్ష్మి, ధనమ్మ,భవాని తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333