జిల్లా పరిషత్ హైస్కూల్ నందు చోరీ..విలువైన వస్తువులు దొంగిలించిన దొంగలు

మునగాల 01 సెప్టెంబర్ 2025
తెలంగాణ వార్త ప్రతినిధి:-
తగు విచారణ చేసి దొంగతనం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
పాఠశాలప్రధానోపాధ్యాయులు తేజోరామ్
మునగాల:మండలపరిధిలోని కలకోవ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు,మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది, వివరాల్లోకి వెళితే జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కలకోవ ప్రధానోపాధ్యాయులు తేజోరామ్ వివరాలు తెలియజేస్తూ, మంగళవారం రాత్రి సమయంలో పాఠశాలలో నాలుగు గదులు, ప్రధానోపాధ్యాయుల గది, స్టాఫ్ రూమ్, సైన్స్ ల్యాబ్ రూమ్, 9వ తరగతి గది రూమ్, తాళాలు పగలగొట్టి పాఠశాలలోని ఈ క్రింద తెలిపిన వస్తువులను దొంగతనం చేయడం జరిగింది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. దొంగలించినవస్తువుల వివరాలు:1, ఆరు బ్యాటరీలు,2, సౌండ్ సిస్టమ్స్, 3, గ్యాస్ బండ, తగు విచారణ చేసి దొంగతనం చేసిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని మునగాల ఎస్సై బి ప్రవీణ్ కుమార్ కి పిటిషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.