గ్రామపంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్.
నాగారం జూలై 30:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ సిబ్బంది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల 31అసెంబ్లీ ముట్టడి కి పిలుపునివ్వగా మంగళవారం నాగారం మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని గ్రామపంచాయతీ సిబ్బంది పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ముందస్తు అరెస్టులు ఏ ఎస్ ఐ వెంకట రాములు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో గ్రామపంచాయతీ సిబ్బంది మండల ప్రధాన కార్యదర్శి ఎస్. నాగ చారి ఉపాధ్యక్షులు చిప్పలపల్లి మల్లయ్య ఈదుల యాదగిరి మైనర్ సతీష్ వడ్డే యాదగిరి సత్తయ్య తదితరులు ఉన్నారు.