షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Mar 7, 2025 - 18:45
Mar 7, 2025 - 18:50
 0  152
షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది...

180 కోట్ల బ్యాంకు బకాయిలు కూడా చెల్లించడం జరిగింది...

ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ అరవింద్ తన సొంత నిధులతో ఫ్యాక్టరీని తెరిపించాలి...

దయ్యాలు వేదాలు వల్లించినట్లు బిజెపి షుగర్ ఫ్యాక్టరీ కోసం ధర్నాలు చేయడమేంటి... 

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్

కోరుట్ల నియోజకవర్గంలో గల ఏకైక రైతు ఆధారిత పరిశ్రమ అయినటువంటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ అన్నారు గురువారం కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ నేతలు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని ధర్నా చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అట్టి కమిటీ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఇప్పటివరకు 180 కోట్ల బ్యాంకు బకాయిలను కూడా చెల్లించడం జరిగిందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణను కమిటీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నామని బిజెపి నేతలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు గతంలో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ తన సొంత నిధులతో ఫ్యాక్టరీని తెరిపిస్తానని మాట ఇచ్చి ఇప్పటివరకు కూడా తెరిపించక పోగా కనీసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ కోసం చేసిన అప్పు బకాయిలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు షుగర్ ఫ్యాక్టరీ పై నిజమైన ప్రేమ ఉంటే పార్లమెంటు సభ్యులు ధర్మపురి ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధులతో ఫ్యాక్టరీని తెరిపించి ప్రజలకు మేలు జరిపించాలని కోరారు అంతేకానీ లేనిపోని అపోహాలను ప్రజల్లో రైతుల్లో సృష్టించి సమస్యను పక్కదోవ పట్టించకూడదని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ హితవు పలికారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333