నేటి బాలలే రేపటి పౌరులు జిల్లా ఎస్పి కె నరసింహ
తల్లిదండ్రులు నాటిన మొక్కలు పిల్లలు.
ఫలాలు ఇచ్చే మహా వృక్షంలాగా పిల్లలు ఎదగాలి.
విద్యార్థులు స్వీయ క్రమశిక్షణతో ఆశయాలను, లక్ష్యాలను సాధించాలి.
తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.
క్రమశిక్షణతో, పట్టుదలతో కృషిచేసి చరిత్రలో నిలవాలి
తిరుమలగిరి 16 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా తిరుమలగిరి పోలీసుల ఆధ్వర్యంలో తిరుమలగిరి మండల కేంద్రంలో మోడల్ పాఠశాల నందు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ పూలమాలవేసి జిల్లా పోలీస్ శాఖ తరపున నివాళి ఘటించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆశయ సాధన తో కృషి చేస్తే మంచి విజయాలు వస్తాయని ఎక్కడ కూడా చెడు అలవాట్లకు, చెడు ప్రవర్తనకు వెళ్ళవద్దు అని కోరారు. తల్లిదండ్రులు నాటిన మొక్కలు పిల్లలు అని మహా వృక్షం లాగా ఎదిగి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చి, సమాజసేవ చేయాలి ఇవ్వాలని కోరారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. చెట్టు చుట్టూ మొలిచే కలుపు మొక్కలను తొలగించినట్లు మన చుట్టూ ఉన్న చెడును తొలగించాలి. క్రమశిక్షణతో ఉండాలి, ఆశయాల కోసం పట్టుదలతో, క్రమశిక్షణతో కృషి చేస్తే మంచి విజయాలు సాధిస్తారు, తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వారు కష్టపడుతూ పిల్లలను చదివిస్తారు వారి కష్టాన్ని గుర్తించి చదువుకోవాలి. మంచి పుస్తకాలను ఎంచుకోవాలి, సమాజంలో సోషల్ మీడియా ప్రభావం చాలా ఉన్నది ఇంటర్నెట్ ప్రభావం ఉన్నది వీటి నుండి జ్ఞానాన్ని పొందాలి సమయాన్ని వృదా చేసుకోవద్దు అని కోరారు. ఉపాద్యాయులు నేర్పే ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి, స్వీయ క్రమశిక్షణ ఉంటే భవిష్యత్తులో రానిస్తారు అన్నారు. ఇంటర్మీడియట్ విద్య భవిష్యత్తుకు పునాదిలంటిది ఇక్కడే పిల్లల భవిష్యత్తుకు బీజం పడుతుంది మంచి మార్గంలో వెళితే మంచి స్థాయికి చేరుకోవచ్చు. ప్రస్తుత సమాజంలో తాత్కాలిక ఆనందం కోసం, మత్తు కోసం డ్రగ్స్, గంజాయి లాంటివాటిని అలవాటుపడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ఎవరైనా గంజాయి బారిన పడితే వారిని మంచి మార్గంలోకి తేవాలి దీనికోసం విద్యార్థులు యూనిఫాం లేని పోలీస్ గా ఉండాలి, సమాచారాన్ని పోలీసు డయల్ 100 కు తెలపాలి అన్నారు. సమాజంలో అత్యంత తీవ్రమైన మరో విషయం సైబర్ నేరాలు, సైబర్ మోసాలు అత్యాశకు పోయి అపరిచితులు డబ్బులు పంపించి ఆర్థికంగా నష్టపోతున్నారు. నెల మొత్తం కష్టపడి పని చేసి సంపాదించిన సొమ్మును ఒక్క otp ద్వారానో, ఒక బ్లూ లింక్ ద్వారానో సైబర్ మోసగాళ్ళు దోచుకుంటున్నారు. ఇలాంటి వాటిని నిర్మూలించాలి అన్నారు. సమాజంలో చిన్న చిన్న గొడవల వల్ల సమయాన్ని ఆర్థికంగా నష్టాన్ని చూస్తున్నారు ఎవ్వరూ గొడవలు పెట్టుకోవద్దు అనేది తెలియ జేయాలి నేటి బాలలే రేపటి పౌరులు ఆన్న నానుడిని విద్యార్థులు నిజం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సంజీవ్, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, తిరుమలగిరి ఎస్సై వెంకటేశ్వర్లు, అధ్యాపక బృందం, ప్రజా భరోసా కళా బృందం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.....