ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Oct 15, 2025 - 22:03
Oct 16, 2025 - 20:48
 0  3
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 16 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :   తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురంలో బుధవారం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఆయన కోరారు.  రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వై. చామంతి, మున్సిపల్ కమిషనర్ మున్వర్ ఆలీ, తహసిల్దార్ హరి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ చాగంటి అనసూయ, మెప్మా అధికారి రేణుక, నిర్వహణ సిబ్బంది,దానియేలు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి