ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది

Apr 25, 2024 - 19:06
 0  4
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది

అమరావతి: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దని భారత చైతన్య యువజన పార్టీ  పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌లో కోరారు. ఇప్పటి వరకు 62వేల మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్  కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని చెప్పారు. రాజీనామాలు ఆమోదిస్తే వారంతా వైకాపాకు అనుకూలంగా ఉంటారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉమేశ్‌చంద్ర వాదించారు. ఆర్టికల్‌ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆ అధికారాలు వినియోగించవచ్చని తెలిపారు. పిటిషనర్‌ వాదనలపై కౌంటరు దాఖలు చేయాలని ఈసీని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333