ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
పోలీస్ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది.ముందుగా ఎస్పి గారు జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే మహిళా పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయ్యారు.ఈ సందర్బంగా వారితో సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలో సమానంగా రాణిస్తున్నారని అన్నారు.ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసే మహిళా అధికారులు మరియు సిబ్బంది తమ కుటుంబాన్ని,పిల్లలను చూసుకుంటూ తమ తమ విధులను భాద్యతగా నిర్వర్తించడం ప్రశంసనీయమని అన్నారు.ఉద్యోగాలు చేసే మహిళలు తమ పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవడంలో ఖచ్చితమైన అవగాహన,ప్రణాళిక కలిగియుంటారని తెలియజేసారు.పోలీస్ శాఖలో పనిచేసే మగవారితో సమానంగా మహిళా అధికారులు కూడా నిరంతరం ధైర్యంగా ప్రజలకు సేవ చేయడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే మహిళా సిబ్బంది మరియు అధికారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన మహిళా కానిస్టేబుల్ రత్న కుమారిని ప్రత్యేకంగా సన్మానించారు.తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా అధికారులు మరియు సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.ఎస్పీ గారి సమక్షంలో కేకును కట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ అధికారులు సిబ్బంది తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయబాబు,కార్యాలయ సూపరింటెండెంట్ సత్యవతి,షీ టీం ఇంచార్జి ఆరెఎస్సై రమాదేవి,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,3టౌన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.