ఘనంగా స్వామి వివేకనంద జయంతి
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ఘనంగా స్వామి వివేకనంద జయంతి ఆత్మకూరు ఎస్. మండల పరిధిలో నీ ముక్కుడు దేవులపల్లి గ్రామం లో ప్రగతి యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద జయంతి 162 వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యువజన సంఘం అధ్యక్షుడు ఇరుగు మధుకర్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటి చెప్పిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి కోడి ఉపేందర్ ఇరుగు అశోక్ ఇరుగు కర్ణకర్ కోడి ఉదయ్,నారపాక శ్రీను ఇరుగు మనోజు సారగుండ్ల ఉపేందర్ చైతన్య యువజన సంగ సభ్యులు ఇరుగు మధు మూరగుండ్ల మధు ఒంటెపాక శివ పాల్గొన్నారు.