నీటి పంపిణీలో సమన్యాయం పాటించాలి.... ములకలపల్లి రాములు
మునగాల 03 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని నిర్బంధంగా పోలీసులను అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి నిర్బంధంగా నీటిని పాలేరుకు తరలించటం సరియైనది కాదని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పాలేరు తో పాటు సూర్యాపేట జిల్లాలోని సాగర్ ఎడమ కాలువపై ఆధారపడిన గ్రామాల్లో సాగర్ నీటితో చెరువులు కుంటలు వెంటనే నింపాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మునగాల.మాజీ జడ్పిటిసి.ఎంపీపీ ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు బుధవారం మునగాల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోని సాగర్ ఎడమకాలపై ఆధారపడిన రైతంగం వేసంగిలో పంటలు వేసి.వేసిన పంట చేతికి రాక పొట్ట దశలో ఎండిపోయి పంట చేతికి రాక. త్రాగటానికి మంచి నీరు కూడా దొరకక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు కానీ పాలేరుకు నీటిని తరలింపులో ఎన్ఎస్పి అధికారులు పక్షపాతంగా ఎవరిస్తూ సూర్యాపేట జిల్లాలోని సాగర్ ఎడమ కాలువ ప్రాంతా రైతాంగం పై చవితి తల్లి ప్రేమ చూపుతున్నారని వారు విమర్శించారు ఏప్రిల్ మాసంలోనే తీవ్రమైన నీటి ఎద్దడి వల్ల భూగర్భ జలాల అడుగంటి గ్రామాల్లో మంచినీరు కూడా దొరికే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో సాగర్ ఎడమ కాలువ ద్వారా వదిలిన నీటిలో కొంత బాగా నైనా హుజూర్నగర్..కోదాడ నియోజకవర్గ ప్రాంతాలకు ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్బంధంగా తూముల దగ్గర పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి రైతాంగాన్ని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి నీటిని పాలేరుకు తరలించడం సరైన కాదని వారు విమర్శించారు నీటి పంపిణీలో సమన్యాయం పాటించాల్సిన ఎన్ఎస్పి అధికారులు పక్షపాతంగా వ్యవహరించటం సరైన కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు పాలేరు రిజర్వాయర్ తో పాటు కోదాడ. హుజూర్నగర్ నియోజకవర్గ గ్రామాలకు సాగర్ ఎడమ కాలువ నీటి ద్వారా చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేశారు ఇప్పటికే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన కరువు వచ్చి గ్రామాల్లో మంచినీరు కూడా దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా నీటిపారుదల శాఖ మంత్రిగారు జోక్యం చేసుకొని సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్న కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గం లో ఉన్న గ్రామాలతో పాటు పెన్ పహాడ్..మండలంలోని లిఫ్ట్ ఆధారిత గ్రామాల్లో చెరువులు కుంటలు నింపి ప్రజల దాహార్తిని తీర్చాలని విజ్ఞప్తి చేశారు లేనిపక్షంలో ప్రజలు. రైతాంగం ప్రత్యక్ష పోరాటలకు సిద్ధమవుతారని వారు హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోంపంగా జానయ్య జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి రాపోలు సూర్యనారాయణ కిన్నెర వెంకన్న నారసాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు