ఎండాకాలం తాగునీటి సమస్య లేకుండా చూడాలి..... రైతు సంఘం మండల అధ్యక్షుడు చంద్రయ్య
మునగాల 03 ఏప్రిల్ 2023 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండలo, రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మాత్యులు, శ్రీ నల్ల మదా ఉత్తంకుమార్ రెడ్డి మంత్రి గారికి మండల రైతు సంఘం ద్వారా త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని జిమెయిల్ ద్వారా పంపడం జరిగినది. ప్రస్తుతం వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయినయి మండలంలోని సాగర ఆయకట్టు గ్రామాలలో త్రాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పశువులు, పక్షులు కూడా త్రాగుటకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి త్రాగు నీటి కొరకు నాగార్జునసాగర్ ఎడమ కాలువ లిప్ట్ ల ద్వారా చెరువులు,కుంటలు నింపి ప్రజల అవసరాలరీత్యా త్రాగునీటి సమస్యను పరిష్కరించి సాగర్ ఆయకట్టు ప్రజల దాహార్తిని తీర్చగలరని. అట్లాగే విద్యుత్ ఎస్సీ వచ్చి లిఫ్టుల కరెంటును తొలగించినారు కావున లిఫ్టుల కరెంటును పునఃరుదీకరించి లిఫ్టులను నచ్చే విధముగా తమరు ఆదేశాలు ఇవ్వగలరని. మునగాల రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు చందా చంద్రయ్య, కార్యదర్శి దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి, రైతు సంఘం నాయకులు బోళ్ల కృష్ణారెడ్డి, సుంకరి పిచ్చయ్య, వీరబోయిన వెంకన్న,మండవ వెంకటాద్రి, బచ్చలకూర స్వరాజ్యం, బట్టు నాగయ్య, మామిడి గోపయ్య, పాల్గోన్నారు.