కొత్త సర్పంచ్‌లకు శిక్షణ.. ఒక్కొక్కరికి రూ.5,000 ఖర్చు
తెలంగాణ (మఠంపల్లి): రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణ తరగతులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ) ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలోని సర్పంచులను ఐదు బృందాలుగా విభజించి (ఒక్కోక బృందం లో 50 మంది) 5 రోజుల పాటు ఆయా జిల్లాల్లో తరగతులు నిర్వహిస్తారు. వారికి బస, భోజనం, శిక్షణా ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.5,000 వరకు వెచ్చిస్తారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.సర్పంచులకు వారి అధికారాలు, విధులు, పాలన, ఆర్థిక నిర్వహణ, నిధులు, గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు.