నవ్వులరేడు ఇకలేడు. 

Mar 25, 2025 - 20:02
 0  20
నవ్వులరేడు ఇకలేడు. 

వెంకటేష్ మృతితో షేక్ పల్లిలో విషాదఛాయలు.

జోగులాంబ గద్వాల 25 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: పంచాయతీ కార్యదర్శిగా షేక్ పల్లిలో సుధీర్ఘకాలం సేవలందించిన పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ మృతితో షేక్ పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతిచిన్న వయస్సులో కార్యదర్శిగా షేక్ పల్లిలో వెంకటేష్ విధులు నిర్వహించాడు.అవసరాలకోసం తన దగ్గరకొచ్చే అమాయక ప్రజల పట్ల దయాగుణంతో సహాయంచేసే వెంకటేష్ మరణం బాధాకరమని గ్రామ మాజీ సర్పంచ్ రవీంధర్ రెడ్డి,ఉమ్మడి ఇటిక్యాల మండల మాజీ ఎంపిపి స్నేహశ్రీధర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.మంచికి మారుపేరుగా, నిజాయితీకి నిలువెత్తురూపంగా గ్రామస్తుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వెంకటేష్ మృతిపట్ల గ్రామస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా నిజామాబాద్ కి బదిలీ అయిన వెంకటేష్..ఇటీవల గ్రామస్తులతో కలిసి మళ్ళీ మీ ఊరికే వస్తానని అన్నారని గ్రామస్తులు గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333