మల్దకల్ ఆణిముత్యం నంద కుమార్ కు ఘనంగా సన్మానం

Mar 25, 2025 - 20:00
 0  4
మల్దకల్ ఆణిముత్యం నంద కుమార్ కు ఘనంగా సన్మానం

జోగులాంబ గద్వాల 25 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్దకల్ నందు నేడు  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రానికి చెందిన దామ వెంకటేశ్వర్లు,పద్మావతి ల కుమారుడు దామ నందకుమార్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2,3,4 లలో అర్హత సాధించి ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా నందకుమార్ ను, ఎన్నో శ్రమలకోర్చి తన కుమారుడిని ఉన్నత స్థాయి కి ఎదిగే వరకు కృషిచేసిన వెంకటేశ్వర్లు ని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు G సురేష్  , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్  మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ఇటువంటి విజయాలను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని కోరారు. విద్యార్థులు ,మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  చెప్పినట్లు  పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాకారం చేసుకునేలా  కృషిచేయాలని ఫలితం దానంతట అదే వస్తుందని నందకుమార్  విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల అంటూ ఏమీ తేడా లేకుండా విజయం వైపు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సురేష్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333