ప్రభుత్వ కళాకారుల ఆట పాట
జోగులాంబ గద్వాల 25 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ కుమార్, తెలంగాణ సాంస్కృతిక సారధి రాష్ట్ర ఛైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్ ఆదేశాలు మేరకు అలంపూర్ మండలంలో కళాకారుల అవగాహనా కార్యక్రమలు. ఎండలు మండుతున్నాయినీ ప్రజలు జాగ్రత్త గా ఉండాలని మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలపై కళాకారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ సారథ్యంలో డి పి ఆర్ ఓ ఆరిఫుద్దిన్ అధ్యర్యంలో అలంపూర్ తహసీల్దార్ మంజుల నేతృత్వంలో అలంపూర్ మండలం ఇమాంపూర్ గ్రామం లో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల అధ్యక్షులు మొహమ్మద్ రాహుల్ నేతృత్వంలో ప్రజలు ఎండ తీవ్రత లో జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనమే రక్షించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ప్రజలకు ఆట పాటలతో వివరించడం జరిగింది. ఆహ్లాదకరమైన గాలి కొరకు చెట్ల కింద ఉండవచ్చని, ఫ్రిడ్జినీరు కాకుండా కుండలో నీరు త్రాగాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రజలు అధికారులు,
కళాకారులు రమాదేవి, హజరత్, కేశవులు,స్వామి,కృష్ణ పాల్గొన్నారు.