దగ్గుబాటి వైష్ణవి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిజ నిజాలు నెగ్గి తేలాలి

టి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రావణ్ కుమార్ మాదిగ

Feb 16, 2024 - 18:58
Feb 16, 2024 - 20:12
 0  5
దగ్గుబాటి వైష్ణవి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిజ నిజాలు నెగ్గి తేలాలి

దగ్గుపాటి వైష్ణవి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిజ నిజాలు నిగ్గు తేల్చాలి

టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రవణ్ కుమార్ మాదిగ.

సూర్యాపేట :- దురాజ్పల్లి గురుకుల పాఠశాల ఇటీవలే జరిగిన దగ్గుపాటి వైష్ణవి మృతికి కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని అలాగే వారిపై ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జ్ తో సమగ్ర విచారణ జరిపి కారకులను వెంటనే చట్ట పరమనైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వైష్ణవి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియ వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని అదేవిధంగా ప్రతి గురుకులాల్లో విద్యార్ధుల మానసిక స్థితి తెలుసుకోవడానికి ఒక సైకియాట్రిస్ట్ ని కూడా వెంటనే నియమించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తల్లి దండ్రులు ఎంతో నమ్మకంతో గురుకులాల్లో తమ పిల్లలను పిల్లల భవిష్యత్తును ప్రభుత్వ మరియు అధికారుల చేతిలో పెడుతుంటే మా పిల్లలను మాకు మాత్రం ఒక విగత జీవులుగా మరియు మృతులుగా వారికి కనపడడం తల్లి తండ్రులను మమ్ములను మరింత క్షోభ కు గురిచేస్తుంది అని వారు బాధపడ్డారు. వైష్ణవి కుటుంబ సభ్యులకు మా తెలంగాణ ఎమ్ఆర్పిఎస్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా మా తెలంగాణ ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుదని ప్రభుత్వం వైష్ణవి కుటుంబానికి న్యాయం చేయకపోతే తెలంగాణ ఎమ్మార్పీఎస్ తరపు నుండి ఎంతటి న్యాయ పోరాటానికి అయిన సిద్ధమే అని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రవణ్ కుమార్ మాదిగ పట్టణ అధ్యక్షులు పిడమర్తి మధు మాదిగ ఆత్మకూరు మండల అధ్యక్షులు బొల్లే అశోక్ మాదిగ సూరారపు నాగయ్య మాదిగ ములకలపల్లి శ్రీను మాదిగ పొట్లపహడ్ గ్రామ శాఖ అధ్యక్షులు కొండేటి నాగయ్య మాదిగ గంగారపు నాగయ్య మాదిగ గంగారపు సోమేశ్వర గంగారాపు మధు ములకలపల్లి మనోజ్ మరియు విద్యార్థి సంఘాలు ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొని వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State