ఉపాధ్యాయుల కోసం ధర్నాకు దిగిన విద్యార్థులు

Jul 9, 2024 - 19:59
Jul 9, 2024 - 20:47
 0  28
ఉపాధ్యాయుల కోసం ధర్నాకు దిగిన విద్యార్థులు

09-07-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం: చిన్నంబావి మండలం  అయ్యవారిపల్లి గ్రామహైస్కూల్లోని ఆరు తరగతులకు ఒక హెడ్మాస్టర్, గారు మాత్రమే ఉన్నారు. ఒక పీఈటి  ఉన్నాడు చిన్నంబావి మండలం అయ్యవారిపల్లి గ్రామ హైస్కూల్లో గత విద్యా సంవత్సర కాలంలో కూడా హిందీ, ఇంగ్లీష్, సోషల్ సబ్జెక్టు స్కూల్  టీచర్లు లేకున్నారు,  అయినా ఆ గ్రామ సహకారంతో వాలంటీర్లను పెట్టుకొని స్కూలు నడిపారు. ప్రస్తుతం ఈ హైస్కూల్లో ఆరవ తరగతిలో -12,మంది విద్యార్థులు, ఏడవ తరగతిలో 07, మంది విద్యార్థులు, ఎనిమిదవ తరగతిలో - 14, మంది విద్యార్థులు,9వ తరగతిలో -17,మంది విద్యార్థులు పదవ తరగతిలో -19 మంది విద్యార్థులు మొత్తం= 69 మంది విద్యార్థినీ విద్యార్థులు కలరు. ఈ స్కూల్లో  కనీసం ఏడుగురు ఉపాధ్యాయులు ఉండాలి, కాని  ఆరు  తరగతులకు కలిపి ఒక హెడ్మాస్టర్,  పి ఈ టి ఉన్నారు. ఈ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు కూలీలు మరియు సన్న చిన్న కారు రైతుల పిల్లలు మాత్రమే, ఇది ప్రభుత్వం హై స్కూల్ యొక్క దుస్థితి ఈ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఓట్లు కావాలి తప్పా, వీరి పిల్లలకు మాత్రమే ఉపాధ్యాయులను నియమించలేని, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఉన్నారు తక్షణమే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. అని విద్యార్థులు విద్యార్థుల  తల్లిదండ్రులు ఆవేదన 

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State