ఆర్వి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు విజయవంతం
సూర్యాపేట 16 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట :మండల కేంద్రం లోని టేకుమట్ల గ్రామ పంచాయతీ పరిధి లో ఆదివారం ఆర్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ను టేకుమట్ల గ్రామం తో పాటు చుట్టు పక్క గ్రామాల పేద ప్రజలు విజయవంతం చేయడం అభినందనీయం అని డా. బెల్లంకొండ ప్రియాంక అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన లోపం వలన ప్రాణాలు కోల్పోతున్నారని, కరోనా అనంతరం చిన్న పెద్ద తేడాలేకుండా అందరికి గుండె సంబందించిన వ్యాదులు వస్తున్నాయి బావించి , కొంతమంది గ్యాస్ ప్రాబ్లమ్ గా వారే గుర్తించి సమయం వృధా చేసి ప్రాణాల మీదికి తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ ఆరోగ్య స్థితిగతులపై పరీక్షాలు నిర్వహించుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి వాతావరణం కల్పించేందుకే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని అన్నారు.గతంలో హైదరాబాద్, ఖమ్మం వెళ్ళవలిసి వచ్చేది ఇప్పుడు మనకు అందరికి అందుబాటులోసూర్యాపేట ఆర్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంతో మంది ప్రాణాలను కాపాడింది అని అన్నారు.గుండె కు సంబందించిన ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మా హాస్పిటల్ లో అతి తక్కువ ఖర్చు తో చికిత్స అందించబడుతుందని, అంతే కాకుండ సంతానం లేక ఎంతోమంది ఇబ్బంది పడుచున్న వారికోసం ప్రత్యేకం గా చూడబడునని స్త్రీ సంబందించిన అన్ని వ్యాధులకు చికిత్స అందించబడునని,అదే విధంగా ఎముకలకు సంబందించిన అన్ని రకాల ప్రాబ్లమ్ చూడబడునని డా. ప్రియాంక అన్నారు.ఈ క్యాంపు గుండె, సంతానం లేకుండా ఉన్న స్త్రీ ల కోరకు, ఎముకలకు సంబందించిన జబ్బుల తో పాటు ఉచిత చెక్ అఫ్ తో పాటు,రక్త పరీక్షలు, మెడిసిన్ ను సుమారు మూడు వందల మందికి ఉచిత పంపిణీ చేశారని తెలిపారు .ఈ కార్యక్రమంలో డా. కాంత్, డా. బెల్లంకొండ ప్రేమ్ కుమార్ ,కుసుమ సిద్ధారెడ్డి, బెల్లంకొండ రాంమూర్తి,సురేష్ అల్లుక ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.