తేజ విద్యాలయ ను సందర్శించి విజయవాడ పాఠశాల అసోసియేషన్ సభ్యులు 

Mar 5, 2024 - 20:22
 0  5
తేజ విద్యాలయ ను సందర్శించి విజయవాడ పాఠశాల అసోసియేషన్ సభ్యులు 
తేజ విద్యాలయ ను సందర్శించి విజయవాడ పాఠశాల అసోసియేషన్ సభ్యులు 

      ఈ రోజు కొమరబండ ,కోదాడ తేజ విద్యాలయ పాఠశాలను “ విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్  అసోసియేషన్ “ నుంచి 39 మంది కరస్పాండెంట్స్ సందర్శించడం జరిగింది.    దేశ వ్యాపితంగా విద్యాబోధనలో వినూత్న విధానాలను అనుసరిస్తున్న (38) పాఠశాలను Centre for Innovations in Public Systems (CIPS) సంస్థ గతంలో ప్రకటించింది. ఆ జాబితాలో  తేజ విద్యాలయ చోటు సాధించడం తెలుసుకుని విజయవాడ పట్టణ పరిసరాలకు చెందిన (39) పాఠశాలల యాజమాన్య సభ్యులు ( Vijayawada children’s School & Tutorial Association correspondents) ఈరోజు తేజ విద్యాలయాలు సందర్శించడం జరిగింది. వారు అందరు RTC ప్రత్యేక బస్సులో ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల పనివిధానాన్ని చూసి పిల్లలతో , అధ్యాపకులతో , ప్రిన్సిపల్ తో  మాట్లాడారు.    తేజ విద్యాలయ అనుసరిస్తున్న వినూత్న విధానాలను చూడటం జరిగింది. సత్సంగ్ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. మా తోటను దర్శించారు. పిల్లలకు ఇష్టమైన గ్రంథాలయం , గణిత , తెలుగు ల్యాబ్‌లు , సైన్సు పరిశోధన శాలలు చూడటం జరిగింది.     రోజు వారి పాఠశాల బోధనలో వార్తా పత్రికలు చదవడం దాని మీద వారం వారం పరీక్ష రాయడం గురించి ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు. ఇంకా అనేక బోధన విషయాలను గురించి తెలుసుకోవడం జరిగింది. 

     ఈ కార్యక్రమాన్ని VCSA Secretary చిన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సమన్వయం చేసారు. VCSA ప్రెసిడెంటు వెనిగళ్ల అమ్మాజి  గారు తేజ విద్యాలయ విధానాలు పిల్లలో సృజనను పెంచేవిగా ఉన్నాయని , మీకు చాలా ఉపయోగ పడతాయని చెప్పడం జరిగింది. 
  తేజ విద్యాలయ ప్రిన్సిపల్ రమాసోమిరెడ్డి ని సత్కరించడమైనది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333