కలియుగ ఆరంభమున తల క్రిందులుగా తపస్సు చేసిన ఈశ్వరుడు.

Mar 6, 2024 - 19:03
 0  7
కలియుగ ఆరంభమున తల క్రిందులుగా తపస్సు చేసిన ఈశ్వరుడు.

మహావిష్ణువుని ఆవిర్భవింపజేసిన రుద్రుడు.

జోగులాంబ గద్వాల 6 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. కలియుగ ఆరంభమున పరమశివుడు ఘోరముగా తల క్రిందులుగా తపస్సు చేసి శ్రీమహావిష్ణువును ఆదిశిలపై వెలిసేలా తపమాచరించిన హరిహరాదుల క్షేత్రం ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఒకే శిల పై శ్రీనివాసుడు, అనంతశయనుడు, వరాహ స్వామి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి వెలసిన పుణ్యక్షేత్రం మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం. భక్తులను కనికరించుటకు శ్రీమహావిష్ణువు అనిరుద్దరూపంలో ఇక్కడ వెలిశాడు. ఇక్కడ ఈశ్వరుడు క్షేత్రపాలకుడై క్షేత్రాన్ని మరింత మహిమాన్వితం చేశాడు. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే కాశీ విశ్వనాథ క్షేత్రం సందర్శించిన ఫలితం వస్తుందని గిరిశాచల క్షేత్ర మహత్యం అనే గ్రంథంలో రాయబడి ఉంది.

శివదీక్ష ప్రత్యేకత

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దీక్ష తీసుకొనుట ఎంతో ఫలప్రదం. గతంలో ఈ దేవాలయం నుండి శివదీక్షలు వేళ్లపై లెక్కించ దగినన విధంగా ఉండేది. నేడు అదే స్ఫూర్తితో గ్రామ గ్రామాన శివ స్వాములు శివ దీక్ష తీసుకుని ఈ దేవాలయంలో అభిషేకాలు, పూజలు, అర్చనలు, భజనలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా శివరాత్రికి ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ సిబ్బంది తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333