కార్యదర్శి పై కలెక్టర్ ఫిర్యాదు

Jun 26, 2025 - 21:09
Jun 27, 2025 - 15:28
 0  4

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కార్యదర్శి పై కలెక్టర్ ఫిర్యాదు పర్యవేక్షణ నిర్లక్ష్యం కారణంగా ఎంపీఓ ను సస్పెండ్ చేసిన కలెక్టర్ .. ఆత్మకూరు ఎస్.. మండల పరిధిలోని నెమికలు గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి పై అవినీతి ఆరోపణలతో స్థానికులు జిల్లా కలెక్టర్ కు ఇటీవల ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన డిపిఓ నివేదిక ప్రకారం గ్రామ కార్యదర్శుల పనితీరు అవినీతిపై ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ ఎంపీ ఓ రాజేష్ గౌడ్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శుల పనితీరు అవినీతి అక్రమాలపై ఎంపీ ఓ పర్యవేక్షణ లోపం తీవ్రంగా ఉన్నట్లు గ్రహించిన కలెక్టర్ పంచాయతీ కార్యదర్శుల పైవచ్చిన అవినీతి అక్రమాలలో ఎంపీఓ పాత్ర ఉన్నదని ఎంపీ ఓ బీసు రాజేశ్ ను బుధవారం సస్పెండ్ చేశారు. నెమ్మికల్ పంచాయతీ కార్యదర్శి విజయ్ ఇంచార్జీ కార్యదర్శి గా పనిచేస్తూ పలువక్రమాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఎలక్ట్రిక్ ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. గ్రామంలో ఎవరికి ఏ పని ఉన్న పంచాయతీ కార్యదర్శి మామూలు ఇవ్వనిదే పట్టించుకోడని గ్రామపంచాయతీ సిబ్బందిలో ఒకరిని బినామీగా ఏర్పాటు చేసుకొని అతని ఫోన్కు ఫోన్ పేలు గూగుల్ పేల ద్వారా ముడుపులు తీసుకొని పనిచేస్తున్నాడని ఆరోపించారు. విధులకు వచ్చిన అరగంటలోనే దండు మైసమ్మ ఆలయసమీపంలోని ఒక ఇంట్లో ప్రతిరోజు విందులు వినోదాలతో విలాసాలు చేస్తుంటాడని ఆరోపణల పేర్కొన్నారు. ఎవరైనా పని ఉండి వస్తే డబ్బులు గ్రామ పంచాయతీ సిబ్బంది వై పవన్ కళ్యాణ్ కు డబ్బులు ఇచ్చిన తర్వాత సంతకాలు చేస్తుంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి చెందిన ఇంటి పన్ను బుక్కులు సిబ్బంది పవన్ కళ్యాణ్ గ్రామపంచాయతీ పేరున కాకుండా సొంతగా బుక్కులు ప్రింట్ చేసి పన్నులు చెల్లించిన వారికి గ్రామపంచాయతీ రసీదు కాకుండా సొంతంగా ప్రింట్ చేసిన రసీదులు ఇస్తుంటారని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి ఇంటి అసెస్మెంట్ కాపీ లాంటి పనులు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదులు పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీలో నీడనిచ్చే అతి పెద్ద వేపచెట్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నరికి అమ్ముకున్నాడని వారు ఆరోపించారు. గతంలో కంటే పశువుల సంత వేలం పాట పది లక్షలకు తక్కువగా అప్పగించి పెద్ద మొత్తంలో విక్రమార్క పాల్పడ్డారని ఈ సంత వేలం పాట అక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులతోపాటు ఎంపీఓ రాజేష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు ఫిర్యాదుల పేర్కొన్నారు. ప్రజల వద్ద విభేదాలు సృష్టించి వివాదాలకు కారణం అవుతున్న పంచాయతీ కార్యదర్శ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అతని సహకరించే గ్రామ ప్రత్యేకాధికారి ఎంపీ రాజేష్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ విషయమై ఫిర్యాదుఅందిన కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి నీ నెమ్మికల్ గ్రామపంచాయతీ లో రికార్డులు పరిశీలించేందుకు గత మూడు రోజులు క్రితం ఆదేశించగా రికార్డ్లు అందజేయడంలో పంచాయతీ కార్యదర్శి జాప్యం చేయడంతో పాటు వివేకలు ఇచ్చినట్లు తెలిసింది. రికార్డులు ఉన్న తేడాలను గ్రహించిన కలెక్టర్ మండలం గ్రామపంచాయతీలో రికార్డులను తెప్పించి పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు పనితీరులో నిర్లక్ష్యం అక్రమాలు చోటు చేసుకున్న ఆయన గమనించి పర్యవేక్షణ లోపం తీవ్రంగా ఉన్నట్లుగా గుర్తించిన కలెక్టర్ బుధవారం ఎంపీవో బీసీ రాజేష్ ను సస్పెండ్ చేశారు. వీటితోపాటు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం గా ఉన్నట్లు తెలిసింది.