ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయండి.

Mar 5, 2024 - 19:53
 0  5
ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయండి.

జిల్లాలలో ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని  విద్యుత్ శాఖ కార్యదర్శి  ఎస్. ఏ. ఎం. రిజ్వి అన్నారు. మంగళవారం హైద్రాబాద్ సెక్రటేరియట్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహన్ ఇతర శాఖల ఉన్నతాధికారులతో  కలసి ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల పరిశీలన  పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను మండలాల్లో, మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలపై లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల అధిక ప్రాధాన్యత ఇవ్వాలని   ముఖ్యంగా  లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులో అప్లికేషన్ నెంబర్, ఆధార్ లింకేజీ, గ్యాస్ కన్స్యూమర్ నంబర్,  రేషన్ కార్డు నెంబర్,  సెల్ నంబర్ తప్పక ఉండేలా పరిశీలన చేయాలని సూచించారు. ఒకే కుటుంబంలో ఉండి రెండు దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను క్షున్నంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. జిల్లా వారీగా నివేదికలను జిల్లా కలెక్టర్ ల లాగిన్ ద్వారా పంపించాలని అన్నారు.

     తదుపరి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్  వెబెక్స్ ద్వారా అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు గృహ జ్యోతి, మహాలక్ష్మి పదాకాలు అందే విదంగా కృషి చేయాలని  సూచించారు.
    ఈ కన్ఫెరెన్సు లో  జెడ్.పి సి.ఈ. ఓ అప్పారావు, డి.ఎస్.ఓ మోహన్ రావు,  dao శ్రీధర్ రెడ్డి, సి.పి.ఓ కిషన్, dtdo శంకర్, dwo వెంకట రమణ  వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333