తెలంగాణ తల్లి విగ్రహం ఇకపై రైతు బిడ్డ ఆకారంలో కనబడనుంది

Dec 7, 2024 - 12:26
 0  37
తెలంగాణ తల్లి విగ్రహం ఇకపై రైతు బిడ్డ ఆకారంలో కనబడనుంది

హైదరాబాద్ 06 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట గా రూపొందిస్తున్న మామూలు శ్రీ రూపంపై తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆవిష్కరించనున్నారు.సాధారణ మహిళను పోలినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఇరవై అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్‌ వద్ద ఏర్పాటు చేయనున్నారు. కాళ్లకు పట్టీలు, మెట్టెలు, పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర, మెడలో కంటి, చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రైతు బిడ్డగా ఆకారంలో రూపుదిద్దుకోవడం తెలంగాణ తల్లి విగ్రహం ఇకమీదట గుర్తుంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు చిత్రకారులు రూపుదిద్దారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333