హుస్నాబాద్ ఆర్డీవో కి వినతి పత్రం సమర్పించిన హుస్నాబాద్ జర్నలిస్టు హక్కుల పోరాట సమితి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్ నగర్ లో గల ప్రభుత్వ కార్యాలయాల సముదాయం లో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి బెన్ షెలాం కు హుస్నాబాద్ జర్నలిస్ట్ హక్కు పోరాట సమితి సంఘం అధ్యక్షులు బానోతు హనుమంతు నాయక్, వినతి పత్రాన్ని సమర్పించారు. హుస్నాబాద్ పట్టణ శివారు కిషన్ నగర్ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గత ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన 40 డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీలో అవకతవకలు జరిగాయని వాటిపై సరైన విచారణ జరిపి అర్హులైన జర్నలిస్టుల అందరికీ ప్రభుత్వం నుంచి ఇండ్లు ఇండ్ల స్థలాల పట్టాలను అందించాలని ఆర్డీవో బెన్ షెలాం నుకోరారు. విషయంపై స్పందించిన ఆర్డీవో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల పంపిణీలో అవక తవకల పై సమగ్ర విచారణ జరిపి అర్హులైన జర్నలిస్టు ల అందరికీ లబ్ధి చేకూరేలా చూస్తామని తెలపడం జరిగింది.
జర్నలిస్టు హక్కుల పోరాట సమితి సంఘం అధ్యక్షుడు బానోతు హనుమంతు నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్లలో అవకతవకలు జరిగాయని పలుమార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి, అప్పటి ఎమ్మెల్యే సతీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. గత రెండు రోజుల క్రితం గత రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికార ప్రభుత్వము,ప్రభుత్వ అధికార యంత్రాంగం దీనిపై సరైనవిచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు సరైన న్యాయం జరిగే వరకు హుస్నాబాద్ జర్నలిస్ట్ హక్కుల పోరాట సమితి తరుపున పోరాడుతామని హనుమoత్ నాయక్ తెలిపారు.. ఇటి కార్యక్రమంలో. ప్రధాన కార్యదర్శి వంగరాజు గౌరవ అధ్యక్షులు కనుకుంట్ల శ్రీనివాస్ అధికారి ఠాకూర్ నర్సింగ్ ప్రచార కార్యదర్శి ప్రచార కార్యదర్శి తాడూరి సురేష్ కార్యవర్గ సభ్యులు రవీందర్ అక్రమ్ గోపి సదానందం అనిల్ జగదీశ్వర్ రవి వేణుమాధవ్ శివ శంకర్ సతీష్ ఇతరులు పాల్గొన్నారు