టీఎస్ జేఏ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా...... లింగంపల్లి నాగబాబు

Jun 22, 2024 - 16:33
Jun 22, 2024 - 18:10
 0  4
టీఎస్ జేఏ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా...... లింగంపల్లి నాగబాబు
టీఎస్ జెఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంపల్లి నాగబాబు

మునగాల 22 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ (టీఎస్ జే ఏ)రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లింగంపల్లి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా కమిటీ నాయకులు నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ అసోసియేషన్ లోకి వచ్చిన నాటి నుండి నాగబాబు అన్ని కార్యక్రమాలకు హాజరయ్యారని ,.అసోసియేషన్ అభివృద్ధి కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతో కృషిచేసిన నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమని,అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని యాదగిరి తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దుర్గం బాలు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము,రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలుకల చిరంజీవి,సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి, సూర్యాపేట పట్టణ వైస్ ప్రెసిడెంట్ తాప్సి అనిల్,పట్టణ కార్యదర్శి దేశ గాని వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State