విద్య జ్యోతిల పధకం తక్షణమే అమలు చేయాలి
విద్య జ్యోతిల పధకం తక్షణమే అమలు చేయాలి
ములుగు జూన్ 21 తెలంగాణ వార్త స్టాఫ్ రిపోర్టర్
విద్యాజ్యోతిల పథకం ఎస్సి,ఎస్టి విద్యార్థులకు వెంటనే అమలు చేయాలని భుక్య జంపన్న ములుగు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ జిల్లా నాయకులు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో అధికారమే రావడం కోసం అదే లక్ష్యంగా నోటికి వచ్చిన హామీలను ప్రజలకు ఇచ్చి గాలికి వదిలివేసిన ప్రభుత్వం దానిలో ఒకటి ఎస్టి,ఎస్సి విద్యార్థులకు విద్యాజ్యోతిల పథకం పేరుతో ప్రభుత్వం పదో తరగతి పాస్ అయితే 10 వేల నగదు,గ్రాడ్యుయేట్ పూర్తయితే 25 వేల నగదు,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయితే 1 లక్ష నగదు,పిఎచ్ డి పూర్తి చేస్తే 5 లక్షలు నగదు బహుమానం ఇస్తానని నమ్మించి మా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఎస్సి, ఎస్టి ప్రజల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి మాకిచ్చిన హామీలను గాలికి వదిలేసిన ప్రభుత్వం అని జంపన్న అన్నారు.మీరిచ్చిన హామీలను మీరు మర్చిపోయి ఉంటారు కానీ అధికారం ఇచ్చిన ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుని ఉన్నారు.
విద్యాజ్యోతిల పథకం హామీని వెంటనే నెరవేర్చకపోతే గ్రామాలలో, తండాలలో,గుడాలలో, మండలాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను,మంత్రులను అడ్డుకుంటాం అని జంపన్న అన్నారు.అదేవిధంగా విద్యాజ్యోతిల పథకాన్ని వెంటనే అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో కలిసి రాస్తారోకాలు,ధర్నాలు నిర్వహిస్తాము అని భుక్య జంపన్న అన్నారు.ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటిన ఇంకా హామీని నిర్వర్తించడం పోవటం లేదు.కనీసం దానిమీద కార్యాచరణ చేయకపోవడం ప్రభుత్వం అసమర్థత అని భుక్య జంపన్న తెలిపారు.