జిల్లా కలెక్టర్ బదిలీ అయినందుకు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ

చేసి ఆనందం వ్యక్తం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన గిరిజన, ప్రజాసంఘాలు

Feb 26, 2026 - 13:34
Feb 26, 2026 - 13:42
 0  1

 బోడ రమేష్ నాయక్

లంబాడి హక్కుల పోరాట సమితి
 జిల్లా అధ్యక్షుడు
 మహబూబాబాద్

మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్  బదిలీ అయినందున గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు పార్టీలకతీతంగా టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందం వ్యక్త చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ అతి పెద్ద గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ లో రెండు సంవత్సరాల పైచిలుకు కాలం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ గిరిజన జిల్లాను పది సంవత్సరాలు అభివృద్ధి లో వెనక్కి వెళ్లిందని అన్నారు.

గిరిజన జిల్లాలో ఉన్నటువంటి రైతుల భూ సమస్యలు, పట్టాదారు పాసుబుక్కు సమస్యలు, ఆర్ఓ ఎఫ్ ఆర్ పాస్ బుక్  సమస్యలు, విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, వైద్య సంబంధిత సమస్యలు, నిరుద్యోగులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పన వివిధ సమస్యలతో పాటు జిల్లా అధికారులపై అడ్మినిస్ట్రేషన్ చేయలేని, జిల్లా స్థాయి అధికారుల పైళ్ల విషయంలో కూడా ఇబ్బందులు పాలు చేసిన కలెక్టర్ . అదేవిధంగా జిల్లా కలెక్టర్ కి వచ్చే ప్రత్యేక నిధులను కూడా పేద వర్గాల ప్రజలకు ఎటువంటి సహాయం చేయకుండా, జిల్లాను ఏ విధమైన అభివృద్ధి పథంలో నడవకుండా కలెక్టర్ కి వచ్చిన ప్రత్యేక నిధులను తిరిగి ప్రభుత్వానికి పంపివేసిన ఘనుడు అదేవిధంగా మంత్రుల ఆదేశాలను కూడా బేఖాతర్ చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు మానుకోట జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా టపాసులు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా బదిలీపై మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన కలెక్టర్ స్నేహ శబరిష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇకనైనా మానుకోట జిల్లాను అభివృద్ధి పథంలో నడిచే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏల్ది మల్లయ్య గారు, భీమ నాయక్, రవీందర్ నాయక్, బాలాజీ నాయక్, వస్త్రం నాయక్, బాలకృష్ణ, సంతోష్ నాయక్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333