విత్తనపత్తి రైతులకు న్యాయం చేయాలి.
- గత సంవత్సరం పంట కు జీవోటీ ఫలితాల్లో 80శాతం పైగా వచ్చిన వాటికి పేమెంట్ ఇవ్వాలి
- పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా రేట్లు పెంచాలి.
- వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కలిసిన వినతి పత్రం అందజేసిన...
-తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత .
-NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ .
జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లాలో ఎదుర్కొంటున్న విత్తనపత్తి రైతు సమస్యలను పరిష్కరించి తక్షణమే రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
శుక్రవారం హైదరాబాదులోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని మొన్న జరిగిన రైతు సంఘర్షణ సభలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతుల ఆకాంక్ష మేరకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు స్పందించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు కమీషన్ సమావేశంలో 80 శాతం జీవోటీ ఫలితాల్లో వచ్చిన విత్తన పత్తికి పేమెంట్ ఇస్తామని వ్యవసాయ శాఖ చైర్మన్ కోదండ రెడ్డి సమక్షంలో విత్తన పత్తి కంపెనీలు మరియు ఆర్గనైజర్లు హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఇప్పటి వరకు ఆ హమీ ఎలాంటి కొలికి రాలేదని స్పష్టం చేశారు.
పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా విత్తన పత్తి ప్యాకెట్ పై రెట్లు పెంచాలని, సకాలంలో 80 శాతం జీవోటీ ఫలితాల్లో వచ్చిన వాటికి వెంటనే రైతులకు పేమెంట్ ఇవ్వాలని కోరారు. కంపెనీలు ఖచ్చితంగా రైతులతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై సమస్యలను వివరించగా రైతు కమిషన్ సానుకూలంగా స్పందించినట్లు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలిపారు.
త్వరలోనే గద్వాలలో మరో సమావేశం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.