నిమ్మికల్ పశువుల సంత వేలం పాట వాయిదా

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- నిమ్మికల్ పశువుల సంత వేలం పాట వాయిదా ఆత్మకూరు ఎస్.. అధికారులు గ్రామస్తుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం కారణంగా నేమ్మికల్ పశువుల సంత వేలం పాట వాయిదా పడింది. గురువారం నిర్వహించిన వేలంపాటలో ముగ్గురు వేలంపాటదారులు వచ్చినప్పటికీ గ్రామస్తులు అధికారులు మద్య స్వల్ప వివాదం కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఎంపీవో రాజేష్ గౌడ్ తెలిపారు.2024-2025 సంవత్సరానికి గాను సంత రహదారి కోసం వేలం జరగాల్సి ఉండగా స్థానిక రాజకీయ నాయకులకు అధికారులకు మద్య గత కొంత కాలంగా ఏర్పడిన స్వల్ప వివాదం కారణంగా వివాదం పరిష్కారం అయ్యే వరకు వేలం పాట నిలిపి వేయాలని స్థానికులు అడ్డు చెప్పడం తో వాయిదా వేయడం జరిగిందని రాజేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో apo ఈశ్వర్, నాయకులు సత్యం, యడవెల్లి ముత్తయ్య, చక్రయ్య, వేల్పుల వెంకన్న, ఉపేందర్ ,బొల్లెపాక సైదులు, కార్నాకర్, రేపాక వెంకట్ రెడ్డి, ముత్తయ్య, పచిపాల లింగయ్య, ప్రకాష్ మధు, భిక్షం, లింగయ్య, నాగరాజు,పోలిసు సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.