ఉద్యోగవిరమణ పొందిన SI కుశలవ
కుశలవ దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు.
- 40 సంవత్సరాలు పోలీసు శాఖలో సేవలు అందించడం అభినందనీయం.
--- సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట.
సూర్యాపేట, 31 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు SI గా విధులు నిర్వర్తిస్తున్న SI కుశలవ గారు ఈరోజు ఉద్యోగవిరమణ పొందినారు. ఉద్యోగవిరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజం అని అన్నారు. ఈ సందర్భంగా కుశలవ గారిని వారి కుటుంబ సభ్యుల, స్నేహితుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో ఎస్పి గారు సన్మానించారు. కషలవ గారికి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలీసు డిపార్ట్మెంట్ నందు 40 సం.రాల 5 నెలల పాటు సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్పవిషయం అని, అభినందనీయం అని వారి సేవలను ఎస్పి గారు అభినందించారు, విధులు నిర్వహణలో ఉన్న నుభవాన్ని కొత్తగా విధుల్లో చేసిన వారికి అవసరానికి అందించటానికి అందుబాటులో ఉండాలని అధికారులు కోరారు. ఈ ఉద్యోవిరమణ అనంతరము వారి కుటుంబ సభ్యుల అందరితో సుఖ సంతోషలతో గడపాలని అని, ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అని తెలిపినారు.
అధికారులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు బంధువులు మాట్లాడుతూ విధులలో అంకితభావంతో, బాధ్యతతో పని చేసేవారనీ, కష్టపడే తత్వం కలవారని, అధికారులకు, క్రిందిస్తాయి సిబ్బందికి సలహాలు సూచనలు ఇస్తూ పోలీస్ శాఖలో విలువైన సేవలు అందించాలని కొనియాడారు.
రిటైర్డ్ SI కుశలవ కు పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపిన పోలీసు అధికారులు.
ఉద్యోగవిరమణ రోజు తన పుట్టినరోజు కావడంతో SI కుశలవ గారితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పి గారు, అదనపు ఎస్పి లు, DSP లు, పోలీసు సిబ్బంది.
అనంతరం ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై కుశలవ గారు మాట్లాడుతూ తోటి ఉద్యోగుల, ఉన్నతాధికారుల సహకారంతో, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో విలువైన పోలీస్ సేవలను అందించానని బావోద్యోగానికి గురైయ్యారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పి నాగేశ్వరరావు, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ రవి, AR DSP నరసింహ చారి, AO మంజు భార్గవి, CI లు రాజశేఖర్, వీర రాఘవులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, DCRB ఇన్స్పెక్టర్ హరిబాబు, పోలీసు సంక్షేమ సంఘం సెక్రెటరీ వెంకన్న, రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం వారు కృష్ణారెడ్డి, రంగా రెడ్డి, అబ్దుల్లా, గాలి శ్రీను, కుటుంభం సభ్యులు పాల్గొన్నారు.