లొంగిపోయిన మావోయిస్టు క్యాడర్ లందరికీ యువతరం పార్టీ ఆహ్వానం
రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి
తెలంగాణ వార్త ప్రతినిధి:- లొంగిపోయిన మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న, తిప్పిరి తిరుపతి, మల్ల రాజారెడ్డి, బడే చొక్కా రావు, నూనె నరసింహారెడ్డి, ఎర్రాల్, బర్సే దేవా, మరియు చంద్రన్న, బండి ప్రకాష్, కంకణాల రాజారెడ్డి, సుజాత, తార మరియు మిగిలిన మావోయిస్టు క్యాడర్ లందరికీ యువతరం పార్టీ ఆహ్వానం పలుకుతుంది రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి
గత ఐదు దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి నేడు జనజీవన స్రవంతిలో కలవడం సరైన నిర్ణయమేనని ప్రత్యర్థి దాడిని ఎదుర్కొని ముందుకు వెళ్లడం అసాధ్యమని జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకొని రాజ్యాంగబద్ధంగా రాజ్యాన్ని ఎదిరించి పేదల రాజ్యం ఏర్పాటు చేయడానికి కృషి చేయడమే మన లక్ష్యమని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు,
ఎన్నో దశాబ్దాలుగా దశ దిశలుగా పేదల పక్షాన అనేక రకాలుగా అనేక విధములుగా బడుగు బలహీన వర్గాలకై ప్రాణ త్యాగాలు చేసిన మావోయిస్టు పార్టీ యొక్క మన గడి నేడు అనుకున్న స్థాయిలో ముందుకి నడవలేదని కావున భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగబద్ధమైన లీగల్ ఫ్రేమ్లో మనం జనంతో కలిసి జనంలో మమేకమై జనం కోసం పోరాటం చేసి పీడిత ప్రజల పక్షాన నిలబడి బడుగు బలహీన వర్గాలకు అనుకూలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేద్దామని లొంగిపోయిన మాజీ మావోయిస్టులకు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు,
తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా మరియు చత్తీస్గడ్ ఒరిస్సా లో కూడా మన యొక్క యువతరం పార్టీని వ్యాపించి మీ యొక్క ఆలోచన విధానాలతో రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళ్లి పేద ప్రజలకు అనుకూలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి యువతరం పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని అలాగే యువతరం పార్టీ వ్యవస్థాపకులు పోట్లు ప్రవీణ్, మరియు రాష్ట్ర నాయకులు బాబు అందరూ కలిసి యువతరం పార్టీ లోకి ఆహ్వానిస్తున్నామని మీయొక్క అడుగుజాడలతో మీ యొక్క ఆలోచనలతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి నిర్మాణం చేద్దామని కోరారు.
జై యువతరం జై జై యువతరం.
ఈ కార్యక్రమంలో యువతరం పార్టీ వ్యవస్థాపకులు పోట్రూ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గుగులోత్ బాబు, అజ్మీరా నరేష్ నాయక్, గడ్డం రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.