డ్రంక్ అండ్ డ్రైవ్ 41 మందికి 82000/- నగదు జరిమానా
రోడ్డు ప్రమాదాల ను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత చాలావరకు మద్యం సేవించి వాహనాలు నడుపడంవల్లె ఆక్సిడెంట్స్ అవుతున్నాయని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఒక ప్రకటనలో అన్నారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం వాళ్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఏట ఎంత మంది మరణిస్తూ వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసుకుంటున్నారో ప్రజలు ఆలోచించాలని ఎస్పీ గారు సూచించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ, న్యాయ శాఖ తో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు సురక్షితంగా ప్రయాణించే భద్రతను కల్పించడమే పోలీస్ ప్రధాన ఉద్దేశం అని అందులో భాగంగానే పోలీసులు ఎన్ఫోర్స్ మెంట్ వర్క్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్, విత్ ఔట్ హెల్మెట్, మైనర్ డ్రైవింగ్ , ఓవర్ స్పీడ్, ఇతర ఉల్లంఘనలకు నిత్యం తనిఖీలు చేపట్టి జరిమానాలు విధించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది మహబూబ్ నగర్ టౌన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు