ట్రాన్స్ జెండర్ల కేసు నమోదు*

జోగులాంబ గద్వాల 1అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.*
..లో బుక్ సెంటర్ నడుపుకునే అమ్రేష్ వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి యత్నించిన ఏడుగురు ట్రాన్స్ జెండర్లపై సోమవారం కేసు నమోదైంది. బాధితుడు వివరాల ప్రకారం..ట్రాన్స్ జెండర్లు దసరా మామూళ్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేశారు. వారికి రూ.20 ఇవ్వగా తీసుకోకుండా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.
ఎస్సై మాట్లాడుతూ రోడ్లపై తిరిగే వాహనాల ప్రజలను బలవంతంగా వసూలు చేసే ప్రయత్నం చేస్తే చట్టాపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు..