ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి

అడ్డగూడూరు 01 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో శంకరయ్య ఆధ్వర్యంలో ఎంపీటీసీ,జడ్పిటిసి గ్రామపంచాయతీ 2వ సాధారణ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కొరకు ఎంపిడిఓ శంకరయ్య,తాసిల్దార్ శేషగిరిరావు,పోలీసు హెడ్ కానిస్టేబుల్ వెంకన్న సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా నిర్వహణ సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.