చిన్నోనిపల్లి రిజర్వాయరు డ్యాం నుండి నీరు విడదల ఫలించిన ఇరిగేషన్ అధికారుల కృషి
గత వారం రోజుల నుండి బారి నుండి అతి బారి వర్షాలు కురవడంతో చిన్నోనిపల్లి రిజర్వాయర్ డ్యాంలోకి నీరు పెరగడంతో చిన్నోనిపల్లి గ్రామంలో నుండి నీటిని బయటకు వెళ్లే విధంగా గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉంటూ వారి ఆదేశాల మేరకు గత వారం రోజుల నుండి గట్టు మాజీ ఎంపీపీ విజయకుమార్ గారు కాలువ పనులను పరిశీలించడం పనులను త్వరితగతిన చేపట్టాలని నిన్న కాలువ దగ్గర బ్లాస్టింగ్ చేయించడం జరిగింది. దీనితో పాటు గట్టు తహసీల్దార్ గారు ఇరిగేషన్ ఈ ఈ రాయిముద్దీన్ ఏ ఈ ఉపేందర్ గారు కాంటాక్ట్ర్ సునీల్ గారు తీవ్రంగా శ్రమంచి ఎట్టకేలకు సమాంతర కాలువ ద్వారా ఈ రోజు నీళ్లు బయటకువిడదల చేయడం జరిగింది. చిన్నోనిపల్లి గ్రామస్తులు ఏఈ ఉపేంద్ర గారికి కాంట్రాక్టర్ సునీల్ గారికి కృతజ్ఞతలు తెలిజేస్తున్నాం. ఈ నీటి విడుదల కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ మాజీ సర్పంచ్ ఉమా దేవేందర్ గ్రామ పెద్దలు శ్రీనివాసులు ఈ జయరాం గౌడ్ బసన్గౌడ్ పరమేశు చరణ్ గౌడ్ వీరశేఖర్ కర్వ బీమేష్, ఈరన్న నాగన్న గురన్న తదితరులు పాల్గొన్నారు