జిల్లా ప్రజలకు "విజయ దశమి దసరా" పండుగా శుభాకాంక్షలు

ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా పండుగను జరుపుకోవాలి.
జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐ పి ఎస్
జోగులాంబ గద్వాల 1 అక్టోబర్ 2025ఐదో తెలంగాణవార్త ప్రతినిధి ప్రతినిధి:- దుష్ట శక్తులపై విజయానికి సంకేతముగా జరుపుకునే దసరా వండుగను స్పూర్తిగా తీసుకొని ప్రజలందరు ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయాలని దసరా పర్వదినం సందర్భంగా జిల్లా పోలీసుశాఖ తరపున జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ విజయదశమి దసరా పండుగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... విజయదశమి ప్రజల జీవితాల్లో తేజస్సు, విజయాన్ని తేవాలని ఆకాంక్షిస్తూ. పండుగా ఉత్సవాలు నిర్వహించు కునేవారు సంతోషకరమైన వాతావరణంలో, ఆరోగ్యకరంగా అందరూ కలిసిమెలిసి సోదరాభావంతో ఉత్సవం నిర్వహించుకోవాలని కోరారు.పోలీసుశాఖలో ప్రతి అధికారి ప్రజా రక్షణలో అగ్రగామిగా ఉండి, శాఖ గౌరవాన్ని మరింత పెంచే విధంగా పనిచేయాలని సూచించారు. పండుగలను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ముఖ్యంగా నవరాత్రుల అనంతరం జరిగే దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను కూడా శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ