డి.ఎం.హెచ్.ఓ చేతుల మీదుగా న్యూట్రిషన్ కిట్లు పంపిణీ.

జోగులాంబ గద్వాల 1 అక్టోబర్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-
జిల్లా ఓల్డ్ dm&ho ఆఫీసు లో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ భాగంలో డి.ఎం.హెచ్.ఓ (DM&HO) డాక్టర్.ఎస్.కె సిద్ధప్ప మరియు యెన్. సి. డి. ప్రోగ్రాం ఆఫీసర్ .డాక్టర్ సంధ్య కిరణ్ మయి , టీబి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి. రాజు ఆధ్వర్యంలో టీబి బెనిఫిషరీస్ కు జ్యోతి ఎ. ఎన్.యం. బుర్ధపేట వారు న్యూట్రిషన్ కిట్లు టీబి పేషెంట్స్ కు ఇవ్వడం జరిగినది.
డి.ఎం.హెచ్.ఓ (DM&HO) టీబీ వ్యాధి పట్ల అవగాహన కలిగించారు.........
క్షయ వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ తో పాటు పౌష్టిక ఆహారం ఎంతో కీలకమైనది.
క్షయ వ్యాధిగ్రస్తులు ట్రీట్మెంట్ తో పాటు పౌష్టిక ఆహారం సమతుల్యంగా తీసుకుంటే కచ్చితంగా గెలుస్తారు.
క్షయ వ్యాధి ఎక్కువ శాతం పేద ప్రజలకు సోకుతుంది కాబట్టి పేద టీబి ప్రజలను గుర్తించి న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం జరిగినది.
టీబీ చికిత్సకాలం 6 నెలల వరకు ప్రతినెల అందజేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా డి.ఎం.హెచ్.ఓ (DM&HO) మాట్లాడుతూ జిల్లాలో ఉన్న దాతలు ముందుకు వచ్చి టీబి పేషెంట్లను దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు.
ఇట్టి కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ (DM&HO) డాక్టర్.ఎస్.కె సిద్ధప్ప, యెన్. సి. డి. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంధ్య కిరణ్ మయి,డాక్టర్ జి. రాజు టీబి ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ మాధుర్య,మరియు NTEP స్టాఫ్, శ్రీ, హనుమంతు టి.బి.నోడల్ పర్సన్,ASHA's పాల్గొనడం జరిగినది.