ఆలయల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాయికోడ్ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి

Jan 20, 2025 - 21:08
Jan 20, 2025 - 21:13
 0  19
ఆలయల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆలయల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాయికోడ్ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి. 

అభివృద్ధి నిరంతర ప్రక్రియ. అభివృద్ధి చేపట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది. 

6 గ్యారంటీల్లో భాగంగా జనవరి 26 నుండి నాలుగు ప్రతిష్టాత్మక పథకాల అమలు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కృషి.

పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు.

 అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. 

 రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ టెక్నాలజీ శాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహ. 

అందోల్ ( రాయికోడ్)  తెలంగాణ వార్త ప్రతినిధి :- గత పది సంవత్సరాల కాలంలో బి ఆర్ ఎస్  ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం రాయికోడ్ మండల కేంద్రంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో  భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ  నూతన ఆలయ కమిటీ చైర్మన్  కులకర్ణి ప్రభాకర్,   వైస్ చైర్మన్  గోవ్వ భీమన్న, సభ్యులుగా, పి బసవంతరావు, ఉప్పరి విటల్ బేకర్ కృష్ణవేణి బి నర్సయ్య జొన్నాడ దత్త రెడ్డి లు  మంత్రి  సమక్షంలో  ప్రమాణ స్వీకారం చేశారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలందేళ చర్యలు చేపట్టిందన్నారు ఆరోగ్యంలో భాగంగా రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు 12 వేల రూపాయలు ఈ నెల 26 నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు ఇల్లు లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలకతీతంగా ఇందిర మైండ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. రాయికోడ్ ఆలయ అభివృద్ధి కోసం గతంలో విశేష కృషి చేసినట్లు తెలిపారు ఆలయ అభివృద్ధి కోసం పాలకవర్గంతో కలిసి చిత్తశుద్ధితో పనిచేయున్నట్లు మంత్రి తెలిపారు. రాయికోడు,  కప్పాడ్  చౌరస్తా రోడ్డు 20 రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

 రాయికోడ్ లో ప్రభుత్వ ఐటిఐ ఏర్పాటుకు కృషి చేయునట్లు మంత్రి తెలిపారులోని రెసిడెన్షియల్ పాఠశాల మోడల్ పాఠశాలలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు . రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గెలుపు కోసం కృషి చేయునట్లు మంత్రి తెలిపారు. తన కార్యకర్తలు సర్పంచ్లు, ఎంపీపీలుగా, జెడ్పిటిసిలుగా ఎదగ డానికి అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి కార్యకర్తలకు సూచించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని,  ప్రాంత అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేస్తే ప్రాంతం అని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు రాయకోడ్  మండల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయునట్లు మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య,మండల ప్రత్యేక అధికారి/ జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, దేవాదాయ శాఖ  అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్,  ఆలయ ఈవో  శివ రుద్రయ్య, ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333