అమ్మభవాని మాల ధరించిన భక్తులు

Sep 29, 2025 - 19:56
Sep 29, 2025 - 19:57
 0  12
అమ్మభవాని మాల ధరించిన భక్తులు
అమ్మభవాని మాల ధరించిన భక్తులు

ముదిగొండ 29 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

ప్రతి సంవత్సరం మైసమ్మ పండుగ సమయం రాగానే ముదిగొండ మండల పరిధిలోని పమ్మి గ్రామంలో భక్తి శ్రద్ధలతో బైండ్ల కులస్తులందరూ పూజలు నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరం భవాని మాల ధరిస్తూ అమ్మవారిని ఆరాధించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పురుషులు చిన్నపిల్లలు అనే తేడా లేకుండా అమ్మవారి ఆశీస్సులు పొందాలని దీక్షలో పూనుకుని మాలధారణ ధరించారు. ఎర్రటి వస్త్రాలు ధరించి, చందనం, కుంకుమతో అలంకరించుకుని, ఎరుపు రంగు పూసల మాలను గురువుల చేత మాలధారణ చేసుకుని ప్రతిరోజూ అమ్మవారిని పూజిస్తూ ఆచారాలను కఠినంగా పాటిస్తారు. ఇతర దైవాల మాలలతో పోలిస్తే అమ్మవారి మాల పవిత్రతలో అత్యున్నతమైనదిగా భావించబడుతుంది అని అన్నారు.చిన్న తప్పు జరిగినా కఠిన శిక్ష తప్పదని భక్తులు నమ్ముతుంటారు.మాల వేసిన భక్తులు తెలిపారు.