జిల్లా ఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్
శాంతిభద్రత రక్షణ, పౌరుల రక్షణ లక్ష్యం
పోలీసులు సేవాభావంతో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి
సూర్యాపేట: జూన్ 24:- సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నూతన ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రత రక్షణ,పౌరుల రక్షణకు జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా పని చేస్తుంది అని తెలిపినారు. జిల్లా లో నేరాల తీరుతెన్నులు, సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టి వాటి నివారణకు కృషి చేస్తాం అన్నారు. జిల్లా లో నేరాల రకాలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచుతాం,పెట్రోలింగ్ పటిష్టంగా చేస్తాం అన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ స్నేహపూర్వక పోలీసింగ్ నిర్వహించి.రోడ్డు ప్రమాదాల నివారణ,మహిళల రక్షణ, అక్రమ కార్యకలాపాల నివారణ,డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తాము అని తెలిపారు. జాతీయ రహదారి ఎక్కువగా ఉన్నది ప్రమాదాలు జరగకుండా పని చేస్తాం అన్నారు. యువత నేరాలకు పాల్పడకుండా అవగాహన కల్పిస్తాం అని తెలియజేశారు.నూతనంగా వచ్చిన పోలీస్ బాస్ ని గౌరవ వందనంతో పుష్పగుచ్చములతో స్వాగతం పలికిన పోలీస్ అధికారులుఅనంతరం అదనపు ఎస్పి నాగేశ్వరరావు తో కలిసి జిల్లాలో ఉన్న డీఎస్పీలు , సీఐ లు, ఎస్సై లతో సమావేశం నిర్వహించారు ప్రజలకు పోలీసు సేవలు అందించడంలో పలు ఆదేశాలు ఇచ్చారు.సిబ్బంది అందరూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి,విజువల్ పోలీసింగ్, స్నేహపూర్వక నిర్వహించాలి. పిర్యాదుదారులకు, బాధితుల బరోసా కల్పించాలి అన్నారు. రౌడీ,సస్పెక్ట్ షీట్స్ ఉన్న వారి కదలికలు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. పెట్రోలింగ్ పకడ్బందీగా చేయాలనీ ఆదేశించారు, సూర్యాపేట జిల్లా ఆంధ్రా రాష్ట్రానికి ముఖ్య సరిహద్దుగా,ముఖ ద్వారంగా ఉన్నందున నిఘా కట్టుదిట్టంగా ఉండాలి అని అక్రమ రావణా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పని చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళిక తో ముందుకు వెళ్ళాలి,యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా ఫోకస్ పెట్టాలి,గంజాయి వినియోగం, సరఫరా లేకుండా క్షేత్ర స్థాయిలో నిర్మూలించాలి అన్నారు. రాత్రి వేళ రోడ్లపై ఆకతాయిలను, అనవసరంగా తిరిగే వారిని అదుపు చేయాలి.రాత్రి సమయంలో షాప్స్, వ్యాపారాల నిర్వహణ కు సమయపాలన పాటించెలా ప్రణాళిక అమలుచేయాలని సూచించారు.