కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారించాలి

Jun 24, 2024 - 22:02
 0  4
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారించాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ 

కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 26న జరిగే కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి.* *సామ నర్సిరెడ్డి, ఐఎఫ్ టి యు జిల్లా కమిటీ సభ్యులు* ఈ రోజు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా,కనీస వేతనాలు పెంచాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని ఈనెల 26వ తేదీన కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాను విజయవంతం చేయాలని కరపత్రం ను పాత సూర్యాపేటలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి మాట్లాడుతూ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని అన్నారు 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కార్మికులకు జరుగుతున్న ధరల కనుగుణంగా కనీస వేతనం 27,000 గా నిర్ణయించి అమలు చేయాలన్నారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని సింగరేణి బొగ్గు గనుల పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని కనీస వేతనాలజీవోలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధయత విధానాలకు నిరసనగా ఈనెల 26 న జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా కు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఓ సి గ్రామ కార్యదర్శి తలకొప్పుల ఎల్లయ్య,కోశాధికారి మంగయ్య,సభ్యులు నెమ్మది ఎల్లయ్య,ఐ ఎఫ్ టి యు నాయకులు వెంకన్న,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.