సుగంధర్ నాథ్ (వర్మ) కు ఘనంగా శ్రద్ధాంజలి
జోగులాంబ గద్వాల 15 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల. సూర్య దినపత్రిక విలేకరిగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన సుగంధర్(నాథ్) వర్మ సంస్మరణ సందర్భంగా ఆదివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సుగంధర్ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పాత్రికేయులు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను అన్ని రకాల ఆదుకోవాలని వారు కోరారు. మృతునికి భార్య ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల విద్యాభ్యాసానికి ఆర్థికంగా కుటుంబానికి తోడ్పాటు అందించి ప్రభుత్వము వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుగంధర్ వర్మ భార్య సుజాతకు పాత్రికేయుల తరపున ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ముకుందరావు, కాసేపోగు జాన్, మన్నాపురం రాముడు, రఘునాథరెడ్డి, వెంకటేష్ గౌడ్, రాఘవ గౌడ్, మూర్తి, నాగరాజు, కిరణ్, సంగమేశ్వర్,సురేష్, రామన్ గౌడ్,మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.