డిస్మిస్ ను వెంటనే ఎత్తివేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్
సూర్యాపేట టౌన్ అక్టోబర్ 29 :- రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇప్పటికే డిస్మిస్ చేసిన 10 (పదిమంది) కానిస్టేబుల్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం డిస్మిస్ ని ఎత్తివేయాలి అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మొన్న 37 మందిని సస్పెండ్ చేశారని, ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. పదిమందిని శాశ్వతంగా ఉద్యోగంలో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి డిస్మిస్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగంలో వెట్టిచాకిరికి పనులు చేయించవద్దని, తమ సమస్యలు పరిష్కరించాలని, ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరిన పోలీసు కుటుంబాలను, కర్కశంగా అరెస్టు చేసి డిస్మిస్ చేయడం వలన పోలీసుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎన్నికల సమయంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల బాధలు తెలుసు అని, అధికారంలోకి వచ్చి ఇప్పుడు పోలీసులను డిస్మిస్ చేయడాన్ని తెలంగాణ సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సాధారణంగా పోలీసు కుటుంబాలన్నీ బహుజన కుటుంబాలే అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుజన కుటుంబాలు అంటే చిన్న చూపా అని, తక్షణమే పోలీసులను విధుల్లోకి తీసుకొని, ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారులు దేవ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటీ అంజయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.