ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్న గ్రామస్తులు

Nov 9, 2025 - 20:40
Nov 10, 2025 - 12:27
 0  2
ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్న గ్రామస్తులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మండల పరిధిలోని మక్తా కొత్తగూడెం గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఆదివారం స్థానికులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. మోతె మండలం రాయిని కుంట తండాకు చెందిన ట్రాక్టర్ మక్త కొత్తగూడెం ఏటి నుండి ఇసుక నింపుకొని వెళ్తుండగా స్థానికులు అడ్డుకొని పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.