చెలరేగిన బౌలర్లు.. టీమిండియా ఘన విజయం

Nov 6, 2025 - 18:34
 0  1
చెలరేగిన బౌలర్లు.. టీమిండియా ఘన విజయం

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటర్లు విఫలమైన వేళ బౌలర్లు చెలరేగి అద్భుత విజయాన్ని అందించారు.

శుభ్‌మన్ గిల్(39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28), శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23), సూర్యకుమార్ యాదవ్(10 బంతుల్లో 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్, మార్కస్ స్టోయినిస్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(24 బంతుల్లో 4 ఫోర్లతో 30), మాథ్యూ షార్ట్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, శివమ్ దూబే రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్(3/3) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333