తెలంగాణ రైతులకు అలర్ట్...మరో 2, 3 రోజుల్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లలో పడే ఛాన్స్

Nov 6, 2025 - 18:36
 0  3
తెలంగాణ రైతులకు అలర్ట్...మరో 2, 3 రోజుల్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లలో పడే ఛాన్స్

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇప్పటికే రెండు విడతల్లో రైతుల అకౌంట్లో నేరుగా 4000 రూపాయల వరకు జమ అయ్యాయి.

ఈ ఏడాది చివరి విడత అయినటువంటి పీఎం కిసాన్ యోజన 21వ ఇన్ స్టాల్ మెంట్ డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లలో డైరక్ట్ టు బెనిఫిషియరీ ట్రాన్ష్ ఫర్ ప్రాతిపదికన మూడు సమాన వాయిదాలుగా రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పుడు రైతులు ఎదురుచూస్తున్న 21వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా ఎన్డీటీవీ వెబ్ పోర్టల్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నవంబర్ మొదటి వారంలో పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉందని రిపోర్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. . కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుమారు 27 లక్షల రైతుల ఖాతాల్లో ఈ మొత్తం అద్వాన్సుగా జమ చేశారు. ఈ రాష్ట్రాల్లో ప్రకృతి భీభత్సం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతుల ఖాతాలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే ప్రస్తుతం పిఎం కిసాన్ యోజన డబ్బులు చివరి విడత కావడంతో ఈ నెలలో విడుదల చేసేందుకు ఎక్కువ అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు బీహార్ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికల అనంతరం డబ్బులు విడుదల చేస్తారా అనే సందేహం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాత పథకంతో పాటు కొనసాగుతున్న పథకం కావున ఎన్నికల కమిషన్ ఈ స్కీం ద్వారా డబ్బులు విడుదల చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు తెలపకపోవచ్చు అని నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పిఎం కిసాన్ యోజన కింద రైతులకు అందుతున్నటువంటి ఈ డబ్బు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వారికి ఒక గ్రాంట్ రూపంలో అందిస్తోంది. ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు. ఈ డబ్బులను రైతులు తమ వ్యవసాయ ఖర్చుల కోసం కానీ వ్యవసాయేతర ఖర్చుల కోసం గానీ ఖర్చు చేసినా ఎలాంటి అడ్డంకులు లేవనే సంగతి గుర్తించాలి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333