రైతు రుణమాఫీ మార్గదర్శకారపై ప్రభుత్వం పునరారోచన చేయాలి.
. వేమూరి సత్యనారాయణ
మునగాల 16 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల ముందు. ఇచ్చిన రైతు రుణమాఫీ. ఎలాంటి ఆంక్షలు లేకుండా. అర్హత గల ప్రతి రైతుకు. రెండు లక్షల రుణమాఫీ చేయాలని. మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల వల్ల చాలామంది రైతులు నష్టపోయే అవకాశం ఉందని. ఎన్నికల ముందు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖునే పూర్తి స్థాయిలో ఎలాంటి ఆంక్షలు నిబంధన లేకుండా అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా. సమీక్షలు సదస్సుల పేరుతో కాలయాపన చేస్తూ. మార్గదర్శకాల పేరుతో. రుణబారం తగ్గించుకునే ప్రయత్నం బాధాకరమని కావున డిసెంబర్ 12 .2018. కి ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన. ఆసంమంజసమని రేషన్ కార్డు ( ఆహార భద్రత కార్డు ) పీఎం కిసాన్ పథకం ప్రామాణికమని. ప్రకటించడం. రెన్యువల్ చేసుకున్న రైతులకు. పథకం వర్తించదని చెప్పడం బాధాకరమని. అలాగే. సామాన్య మధ్యతరగతి రైతులు వారి పిల్లల చదువుల కోసం. ఇతర దేశాలకు పంపడం కోసం. ఐటీ రిటర్న్స్ చెల్లించే వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని బ్యాంకులతో సంబంధం లేకుండా ఏ బ్యాంకులో పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ప్రతి రైతుకు రెండు లక్షల రైతులమాఫీ. వర్తింపచేయాలని అన్నారు. ఇలాంటి మార్గదర్శకాలు ఇచ్చి రైతుకు రుణభారం తగ్గించడం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నం చేసి లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని విమర్శించారు